అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలచిన నిడదవోలు జనసేన

నిడదవోలు నియోజకవర్గం, తాడిమళ్ల గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బిర్యానీ సెంటర్ మరియు వికలాంగులు సంక్షేమ సంఘం కార్యాలయాన్ని పరిశీలించి వారికి జనసేన పార్టీ నిడదవోలు మండలం జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడా పూర్ణ, కొప్పిశెట్టి మంగరాజు, కరీబండి ఈశ్వరరావు, వద్దిరెడ్డి రాజు, గ్రామ జనసైనికులు తమ్మిరెడ్డి దుర్గారావు, నవదుర్గ, కరుణాకర్, ఓంకార్ బాధితులను పరామర్శించారు.