తిరుపాడు గ్రామంలో రైతు దినోత్సవ వేడుకలు

నంద్యాల: డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని తిరుపాడు గ్రామ రైతులను సమావేశపరిచి శాలువాలతో సత్కరించి మిఠాయిలు పంచి రైతు దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. గ్రామం లోని రైతుల సమస్యలను తెలుసుకొని, వ్యవసాయ భూములను సందర్శించి వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్నటువంటి వివక్షతను తెలియజేస్తూ అతివృష్టి అనావృష్టి అకాల వర్షాలకు కష్టనష్టాలకు గురైనప్పుడు వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతి రైతు పక్షాన, రైతుల సంక్షేమం కోసం కడుపు నింపే రైతు కన్నీరు పెట్టకూడదని ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున తానే స్వయంగా పరామర్శించి రైతులకు భరోసా ఇస్తూ ఆదుకోవడంలో రైతుల పట్ల పవన్ కళ్యాణ్ కి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి ఆదరించాలని రైతులను ఈ సందర్భంగా నంద్యాల జనసేన నాయకులు చందు, సుందర్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల వీరమహిళ సంగా జయంతి, నందికొట్కూరు జనసేన రాము, జనసైనికులు ఫక్రుద్దీన్ ,ఫరూక్, ఫ్రాన్సిస్, నాగరాజు, చిన్న తదితరులు పాల్గొన్నారు.