కొర్ర గ్రామంలో పర్యటించిన బంగారు రామదాసు బృందం

  • నష్టపోయిన రైతులకు నష్టపరిహారము చెల్లించాలి జనసేన డిమాండ్

అరకు: జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా జనసేన పార్టీ పిలుపు మేరకు శుక్రవారం రైతుల కష్ట, సుఖాలు తెలుసుకునేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండలం, కోర్ర పంచాయతీలో, అరకు జనసేన నాయకులు బంగారు రామదాసు బృందం కొర్ర గ్రామంలో పర్యటించి.. దాన్యం కుప్పలు కాలిపోయి నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం నియోజకవర్గ నాయకులు బంగారు రామదాసు మాట్లాడుతూ.. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో కొర్ర గ్రామానికి చెందిన రైతులు ఏడు కుటుంబాల వారు ఏడు కుప్పలను కాలిపోవడం చాలా బాధాకరమైన విషయం కావున రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం ఆ యొక్క నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారము ప్రభుత్వము చెల్లించాలని, అలాగే పేద కుటుంబానికి చెందిన రైతులకు కనుక ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజాప్రతినిధులు, ప్రజా అధికారులు గ్రామ సచివాల సిబ్బంది కూడా ఇప్పటివరకు పర్యటించకపోవడం చాలా బాధాకరమైన విషయమని రైతులు తెలియపరిచారని ఈ సందర్భంగా రాందాస్ తెలియజేయడం జరిగింది. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏడు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని రైతు దినోత్సవం రొజు వారి యొక్క దుఃఖాన్ని మేము చూసామని, జనసేన పార్టీ నుంచి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు బూర్జ ముత్యాల నాయుడు, శిదారి, అబ్బి, మూర్తి, చంద్రశేఖర్, కిరణ్, విష్ణువర్ధన్, పూర్ణచందర్ మరియు కొర్ర గ్రామస్తులు పాల్గొన్నారు.