పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: జనసేన వినతిపత్రం

చీపురుపల్లి నియోజకవర్గం: నాలుగు మండలాల్లో అకాల వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆర్.డి.ఓకి జనసేన ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే జి.పి.ఎస్ ప్రక్రియ ద్వారా రైతులకు 2500 రూపాయలు అదనంగా భారం పడుతుందని సన్నకారు రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడం జరిగింది. పంట నష్టపోయే బాధలో ఉంటే ఈ జి.పి.ఎస్ ప్రక్రియ ద్వారా రైతులపై పెనుబారంగా మారింది సన్నకారు రైతులను కౌలు రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియని ఉపసంహరించుకుంటారని కూర్చున్నాము. చీపురుపల్లి నియోజకవర్గ గరివిడి మండల అధ్యక్షలు పెద్ది వెంకటేష్ సీనియర్ నాయకులు బోడసింగి రామకృష్ణ ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు దన్నాన యేసు చందక బాలకృష్ణ లెంక జగదీష్ పైల ధనుంజయ గిడిజాల చిరంజీవి ఎ లక్షుమునాయడు తదితరులు పాల్గొన్నారు. దేశానికే వెన్నుముక్క రైతు ఆ రైతునే నిట్ట నిలువునా నిలువు దోపిడీ చేస్తుంటే రాబోయే తరాలకు రైతును ఏ మ్యూజియంలోను చూపించుకోవలసిన పరిస్థితి పడుతుంది.