వలసకూలి కుటుంబానికి జనసేన & మెగా అభిమాన సంఘం నాయకుల ఆర్థిక సహాయం

  • అప్పుల బాధ భరించలేక మరణించిన వలసకూలి కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ & మెగా అభిమాన సంఘం నాయకులు
  • నిరుపేదల క్షేమమే జనసేన ధ్యేయం
  • బాధిత కుటుంబానికి పార్టీ తరుపున చేయుతగా ఉంటామని తెలిపిన – ఉమ్మడి జిల్లా నాయకుడు & వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు

ఉమ్మడి మహబూబ్ నగర్: అప్పుల బాధ భరించలేక మరణించిన పల్లమర్రి గ్రామం ముదిరాజ్ చంద్రయ్య కుటుంబానికి అండగా వారి భార్య పల్లవికి 20,000 ఇరవై వేల రూపాయలను జనసేన పార్టీ మరియు మెగా అభిమాన సంఘం తరుపున ఆర్థిక సహాయం అందిచినట్టు జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. బాధిత కుటుంబం మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలం, పల్లమర్రి గ్రామానికి చెందిన దండు చంద్రయ్య ముదిరాజ్, పల్లవి దంపతులు వలస కూలీ చేస్తూ జీవనం సాగిస్తూ ఆర్థిక పరిస్థితులు బాగాలేక అనారోగ్యం కుటుంబ జీవనానికి చేసిన అప్పుల బాధ భరించలేక చంద్రయ్య పురుగుల మందు తాగి చనిపోవడం జ్రిగింది. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. వారికి పొలం, ఇల్లు ఏమాత్రం లేకపోవడంతో అతని భార్య ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో బాధపడుతున్నట్టు ఈ విషయాన్ని తెలుసుకున్న మక్తల్ నియోజకవర్గ నాయకులు శ్యామ్ మరియు ఎల్లంపల్లి నాగరాజు వారి కుటుంబానికి ఆదుకోడానికి ముందడుగు వేసి ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టినందుకు సంఘటనను వెలుగుచూపిన మిగతా సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ముకుంద నాయుడు పేర్కొన్నారు. అదే విధంగా ఈ కుటుంబానికీ ప్రభుత్వం స్థానిక అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని, వారికి వేంటనే ఇంటి స్థలాన్ని గుర్తించి డబల్ బెడ్ రూమ్ ఇంటిని ఏర్పాటు చేయాలని, ఆమెకు పిల్లలను కుటుంబాన్ని పోషించుటకు ఉపాధి కల్పించాలని కోరారు. ఇంత పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నా నేటికీ ఈ సమాజంలో ఆత్మహత్యలు జరుగుతుండటం చాలా బాధాకరమని, ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేల ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకొని తక్షణమే సహాయానికి ముందుకు వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ మెగా అభిమాన సంఘం నాయకులు ఎల్లంపల్లి నాగరాజు, హైదరాబాద్ రవి, జనసేన హనుమంతు రెడ్డి మరియు వనపర్తి జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా యూత్ సెక్రెటరీ బాలకృష్ణ మరియు సురేష్ యాదవ్, ఉత్తేజ్, భద్రి, శివ, మల్లేష్, రాజు, చెన్నయ్య గౌడ్ , ఎండీ సోఫీ , ఆంజనేయులు, హనుమంతు, ఆర్.కృష్ణ, చిన్న తదితరులు నేటి సమాజానికి ఆదర్శమని తెలిపారు.