చైనా మార్షల్‌ ఆర్ట్‌ స్కూల్లో అగ్ని ప్రమాదం..18 మంది మృతి

చైనాలోని ఓ మార్షల్‌ ఆర్ట్ప్‌ పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున హెనాన్‌ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలో జెచెంగ్‌ కౌంటిలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మొత్తం 18 మంది చనిపోగా, 16 మంది గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది.