సత్యవేడులో జనంకోసం జనసేన మొదటి రోజు

సత్యవేడు, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా కార్యదర్శిలు కొప్పుల లావణ్యకుమార్ దాసు హేమకుమార్ సూచనల మేరకు ఆదివారం సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలంలోని ఎన్.ఆర్ అగ్రహారం పంచాయతీలో మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ నాయకత్వంలో ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో జనంకోసం జనసేన కార్యక్రమాన్ని మొదటి రోజు జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఇంటింటికి తెలియజేస్తూ ప్రజల యొక్క ఆశీస్సులను పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రూపేష్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుందని భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలమని ఆయన ఇంటి ఇంటికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హేమంత్, చెంచయ్య, ప్రధాన కార్యదర్శిలు డివిఎస్ విజయకుమార్, జ్యోతిశ్వర్, ప్రసన్నకుమార్, కార్యదర్శులు విశ్వనాధ్, మునిశేఖర్, సాయి లోకేష్, సంస్థ కార్యదర్శి అనిల్ కుమార్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.