ఈసి అనుమతులు సరిగ్గా లేక నిలిచిపోయిన కుంభ కోటయ్య మైనింగ్

ఈసి అనుమతులు సరిగ్గా లేక నిలిచిపోయిన కుంభ కోటయ్య మైనింగ్ గురించి జనసేన మురళి మాట్లాడుతూ సర్వే నంబర్ 4/2 4/3 మరియు 5 ఈ విధముగా మైనింగ్ తవ్వి అమాయక గిరిజన భూములను విలువైన ఖనిజ సంపదను కుంభ రవిబాబు ఎమ్మెల్యే అయినప్పటి నుండి అనంతగిరి మండలంలో బొర్రా పంచాయతీ డెకపురంలో ఉన్న ఖనిజ సంపదను తీసుకొని పోవడం జరిగినది. ఇక్కడున్న గిరిజనులను మాత్రం ఎటువంటి లాభం లేదు అభివృద్ధి లేదు. భూములు ఈ విధంగా చేయడం వలన కనీసం వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోయాయి. ఈ విషయంలో డెక్కపురం గ్రామస్తులు జనసేన పార్టీకి తెలియజేసి ఉన్నారు. సక్రమమైన పద్ధతిలో లేనందున ఇటు ఆదాయము లేదు, భూమి లేదు తీవ్ర నష్టానికి గిరిజనులకు గురి చేస్తున్నారు. అలాగే గిరిజనలకు భూములు లేకుండా చేశారు అని జనసేన మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.