గురజాలలో జనసేన ప్రజా చైతన్య యాత్ర మొదటి రోజు

గురజాల నియోజకవర్గంలో జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మొదటి రోజు గురజాల నియోజకవర్గం, గురజాల మండలంలోని తేలుకుట్ల గ్రామంలో ఆదివారం గురజాల నియోజకవర్గ జనసేన నేతలు పర్యటించడం జరిగింది. ముందుగా స్థానిక పాటేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ ప్రజలకు వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి వైసీపీని గద్దె దించేందుకు ప్రజలందరూ సమాయత్తం కావాలని కోరడం జరిగింది. జనసైనికులతో సమావేశం నిర్వహించి గ్రామ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. తదనంతరం తేలుకుట్ల గ్రామ జనసైనికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ నాలుగు మండల అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, నాయకులు కార్యకర్తలు వీర మహిళలు, జిల్లా కార్యదర్శి బడిదెల శ్రీనివాసరావు, అంబటి మల్లి, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు వేల్పుల చైతన్య, మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, మందపాటి దుర్గారావు, బొమ్మ శ్రీనివాసరావు, ఉప్పిడి నరసింహారావు, గురజాల కౌన్సిలర్ చింతకాయల కల్యాణ్, భీమా వెంకటేష్, చౌడం పద్మావతి, వీర మహిళలు నిమ్మకాయల సూర్యకుమారి , జనసేన నాయకులు కడియం వీరస్వామి, గురసాల ప్రసాద్, నెల్లూరి సైదారావు, పిచ్చయ్య, బండారు నవీన్, బేతంచర్ల ప్రసాద్, బయ్యవరపు రమేష్, మొగిలి కృష్ణ, అంబటి సాయి కుమార్, కట్టెకోట నవీన్ తదితరులు పాల్గొన్నారు.