ఎచ్చర్ల నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమములు

ఎచ్చర్ల మండలంలో.. భగీరథపురం మరియు ధర్మవరం గ్రామాల్లో ఆదివారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మహోత్సవాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బొంతు విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కూడా ఓటు యొక్క గొప్పతనాన్ని గుర్తించాలని.. గుర్తించకుండా ఒక మందుకో, ఆరోజు ఇచ్చే 500 రూపాయలకు ఆశపడి ఓటిని దుర్వినియోగం చేస్తే మన కష్టాలు ఏ విధంగా ఉంటాయో ప్రస్తుతం పరిపాలిస్తున్న ప్రభుత్వమే మనందరికీ ఆదర్శమని.. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి అలాంటి తప్పిదం చేయకుండా ఓటు యొక్క గొప్పతనాన్ని గుర్తించి.. మంచి వ్యక్తిత్వం మరియు ప్రజల కష్టాలను దగ్గరగా చ విచూసిన వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ గారి యొక్క గుర్తు గాజు గ్లాస్ పై ప్రతి ఒక్కరు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో తీసుకురావలసిన అవసరం ఉందని వివరించారు.