త్రాగునీటి కొళాయిల దగ్గర లోపించిన పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి: రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని త్రాగు నీటి కొళాయి చుట్టూ మురుగు నీరు నిలిచిందని.. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని జనసేన మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రి కి రోజువారిగా ఎంతోమంది రోగులు మరియు వాళ్ళ బంధుమిత్రులు వస్తూ ఉంటారని, వేసవి కాలం కావడం వల్ల త్రాగు నీళ్లు ఎంతో అత్యవసరమైనవని ఇలాంటి సందర్భంలో త్రాగునీరు తాగాలంటే మురికి నీటిలో నడవాల్సి వస్తుందని, చుట్టూ మురికి ఉండడంవల్ల ఆస్పత్రికి వచ్చే రోగులు వాళ్ళ బంధుమిత్రులు దుర్వాసన భరించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణంలో పరిశుభ్రతను పాటిస్తూ ప్రతి ఒక్కరికి మెరుగైన సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.