ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి – పవన్ కళ్యాణ్ పై కాదు: రాయపూడి

అవనిగడ్డ నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ గారిపై ముఖ్య మంత్రి గారు చేసిన వ్యాఖ్యలును ఖండిస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు శుక్రవారం నెల్లూరు జిల్లా, వెంకటగిరిలో జరిగిన ఒక బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన అనుచితమైన వ్యాఖ్యలను జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నాము. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉంది, పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనీ, ప్యాకేజి స్టార్ అనీ, చంద్రబాబు క్రింద వాలంటీర్ గా పని చేస్తున్నాడు అనీ, గజదొంగలు ముఠా అనీ, దౌర్బాగ్యుడు అనీ, పెళ్లిళ్లు గురించి మాటలాడి ఒక నిండు సభలో అలా మాట్లాడడం చాలాబాధాకరం. జగన్ మోహన్ రెడ్డి గారు 12 ఈడీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దౌర్భాగ్యంగా భావించాలి. మీకు ఒక బులుగు పత్రిక, బులుగు మీడియా ఉంది. ఎల్లో మీడియా అనీ ఈనాడు, ఏ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 పైన బురద చల్లటం చాలా సిగ్గుమాలిన చర్య. అలాగే రాష్ట్రాన్ని అప్పులు ఉబిలో ముంచి, రాష్ట్రంలో ఒక అభివృద్ధి పనులు చెయ్యకుండా, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు రోడ్డులు, త్రాగడానికి మంచినీళ్లు, కనీసం గ్రామపంచాయతీలలో బ్లీచింగ్, దోమలు మందుకూడా లేకుండా గ్రామపంచాయతీలు ఉన్నాయి. అంటే అది మీ అసమర్ధ పరిపాలన. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ, అవనితీ, ఒక్క కేసుకూడా లేని అటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యాకిత్వం ఉన్న వ్యక్తినీ మీ నోటికి వచ్చినట్టు నిండు సభలో మాట్లాడటం మీ హోదకు తగినది కాదు. రాష్ట్రంలో రోడ్లు లేని పరిస్థితి, మా అవనిగడ్డ వచ్చి 9 నెలలు క్రితం వివిధ పనులు నిమిత్తం 99 కోట్లు రూపాయలు సెంక్షన్ చేసి ఒక్క రూపాయి కుడా ఇవ్వకుండా, రాష్ట్ర బడ్జెట్ లో 524 కోట్లు నిధులుతో మీ పార్టీ స్టిక్కర్లు వేయించుకొని జగన్ అన్నా మిరే మా నమ్మకం అనీ ఇళ్ల గోడలకు అతికించి ప్రజాదనం వ్రుదా చేస్తున్నారు. మీ సభలో ఇచ్చిన హామీలు కుడా తీర్చలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. ఇంకా ఎంత కాలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం ప్రజలకు మాయమాటలు చెపుతారు?. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలు సి.పి.ఎస్ రద్దు అన్నారు సి.పి.ఎస్ రద్దు చేసే పరిస్థిలో మీరు లేరు, ప్రతి ఏడు జాబ్ క్యాలెండరు విడుదల చేస్తాం అన్నారు. జాబ్ క్యాలండర్ విడుదల లేదు, మద్యపానం నిషేధం అన్నారు. 2025 వరకు బార్లు లైసెన్స్ పెంచారు, మద్యపానం 25 ఏళ్ళు తాకట్టు పెట్టారు. డి.ఎస్.సీ ప్రతి ఏడు ప్రకటిస్తాం అన్నారు. డి.ఎస్.సీ ప్రకటన లేదు పాఠశాలలో ఉపాధ్యాలు లేరు, సామాన్యడు ఇసుక కొనలేని పరిస్థితి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 45 ఏళ్ళు నిండిన వారికీ పెన్షన్ అన్నారు ఆ విషయం పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు లేవు, సంపద లేదు కనీసం రాజధాని కుడా లేని రాష్ట్రముగా తయారు చేసి, బహిరంగ సభలలో ప్రతిపక్షం వారినిపై వ్యక్తి గత విమర్శలు చెయ్యటం ధర్మమా అనీ జనసేన పార్టీ తరుపున అడుగుతున్నాము. మేము కుడా వ్యక్తి గత విమర్శలు చెయ్యగలం కానీ మా నాయకుడు మాకు నీతి, నిజాయితీతో కూడిన సంస్కృతి నేర్పించారు. జగన్ మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నారు. మీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పులిస్టాప్ పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి అనీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తి గత విమర్శలు చెయ్యవద్దు అనీ కోరుతున్నాము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హుందాగా ఉండాలి అనీ విజ్ఞప్తి చేసారు.