పాలచర్లలో “నా సేన కోసం… నా వంతు”

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాలచర్ల గ్రామంలో ఉత్సాహం నిండిన జనసైనికుల మధ్య హోరెత్తే బాణాసంచాల మధ్య అంగరంగ వైభవంగా పాలచర్ల జనసైనికులు బత్తుల బలరామకృష్ణ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నా‌ సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి లకు ఘన స్వాగతం పలికారు.
హోరెత్తిన జనసైనికుల కోలాహలం మధ్య కార్యక్రమం మొదలైంది.
ముందుగా సూరపురెడ్డి రాజారావు మాట్లాడుతూ పాలచర్ల జనసైనికుల సేవలను ప్రశంసించారు. నిస్వార్థంగా పనిచేసే‌ జనసైనికులు ఈ గ్రామంలో ఉండటం మా అదృష్టం అని జనసైనికులని అభినందిస్తూ ఆయన ప్రసంగాన్ని ముగించారు. నాతిపాము దొర, గల్లా రంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ విధివిధానాలను, ప్రత్యర్ధుల తప్పొప్పులు వివరిస్తూ తమదైన శైలిలో వారి భావాలని తెలియజేశారు.

రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ వైయస్ గారు ప్రారంభించిన ఉచిత పథకాలను అతని తనయుడు పేదలకు దూరం చేస్తున్నాడు. మంచి నాయకుడు, మంచి నాయకత్వం, మంచి సమాజం కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మెరుగైన వైద్య సేవలకు రైతుల గిట్టుబాటు ధరలకు పేదల ఇంట్లో వెలుగును నింపే ఒకే ఒక్క నాయకుడు చేయగల సత్తా ఉన్న దమ్మున్న సేవకుడు కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని బత్తుల బలరామకృష్ణ నాసేన కోసం నా వంతు కార్యక్రమంలో పాలచర్ల గ్రామంలో అన్నారు. రాష్ట్రం బంగారు బాట పట్టాలి అంటే ఈ బానిస సంకెళ్లు తెగాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే సాధ్యమవుతుంది అందుకోసం మీరందరూ జనసేన యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఆ బాధ్యత మన జన సైనికులు తీసుకోవాలి అని బత్తుల తెలిపారు. ఈ రోజు అధికార పార్టీని చూసి మనం భయపడుతున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నిజానికి మనల్ని చూసి అధికార పార్టీ వాళ్లు భయపడుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు బలంగా ప్రతి జనసైనికుడు పోరాడండి మీ వెంట నేనుంటాను మీ మీద ఎవరైనా చేయి వేయాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ వెంట నేనుంటాను మీ సుఖంలో నేను పాలు పంచుకోకపోయినా మీ కష్టంలో మీతోనే మీకోసమే ఉంటాను అని తెలియజేశారు.
స్వాతంత్రం కోసం పోరాడిన యోధులే మనకు స్ఫూర్తి పోరాడుదాం నవ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరం ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధులమవుదాం. నేను ఎప్పటికీ జనసైనికుడినే పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసే ఒక సైనికుడిని, మీ ముందు, మీకోసం, ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నేను నిలబడతాను రాజానగరం నియోజకవర్గ రాజకీయ సమీకరణాలను మారుద్దాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడానికి మన వంతు సమిష్టి కృషి చేద్దాం. మన రాష్ట్రం మరో శ్రీలంక మరో బంగ్లాదేశ్ కాకుండా ఉండాలి అంటే జనసేన ప్రభుత్వం కచ్చితంగా ఏర్పాటు కావాలి నా రాష్ట్రం నా బాధ్యత అని ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా ఆలోచించి.. మంచి కోరుకునే పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలని ఈ సభ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.
అధికార పార్టీ పథకాలు ఆపుతారని వ్యక్తిగత దాడులు చేస్తారని భయపడుతున్నారు ఎన్ని ఏమైనా ఎన్నికల సమయంలో మీ ఓటు మీ చేతిలోనే ఉంటుంది అప్పుడు ఏ గుండా గాడి అరుపులకి కేకలకి బెదరకుండా ధైర్యంగా జనసేనకు ఓటు వేయండి మార్పు ఎందుకు రాదు చూద్దాం మనల్ని తిట్టిన వాళ్ళు మనల్ని పొగిడే రోజు తొందరలోనే ఉంది అధికార మదంతో పేట్రేగిపోతున్న వైసీపీ శ్రేణులు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎందుకంటే కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే రేపు రేపు ప్రజలు మీకు సరైన గుణపాటాన్ని తెలియజేస్తారు కాబట్టి మీరు జనసైనికులని ఇబ్బంది పెట్టేముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొని అప్పుడు
మాతో పెట్టుకోండి అని సభా ముఖంగా ప్రతిఘటించారు. అన్ని విధాలుగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్న అన్ని రకాల పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి రావాలన్నా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలన్న ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తి అవ్వాలన్న రైతన్న కంట కన్నీరు తుడవాలన్నా జనసేన ప్రభుత్వం తోనే సాధ్యమవుతుంది. పాలచర్ల జనసైనికులు ఎంతో ఉత్సాహంగా పనిచేయడాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే చైతన్యం అందరిలోనూ ఇదే స్ఫూర్తి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఏ కష్టంలోనైనా సరే మీ వెంటే ఉంటానని మరొక్కసారి తెలియజేస్తూ పాలచర్ల జనసైనికులకు నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని నా సేన కోసం నా వంతు కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో చేసే విరాళం అది మనం గుడి, మసీద్, చర్చ్ కి ఇచ్చే విరాళమంతా గొప్పది మీరు ఇచ్చిన ప్రతి రూపాయి పేదవాడి కన్నీటిని తుడవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క జన సైనికుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను అర్థం చేసుకుని తోటి వారికి వివరించి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. డబ్బే అవసరం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కనుసైగా చేస్తే లేదా ఒక్క సినిమాకి కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ సైన్ చేస్తే కోట్లల్లో డబ్బు వచ్చి చేరుతుంది కానీ.. ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు స్థాపించబడిన పార్టీ దీన్ని నడిపించాల్సింది ముందుకు తీసుకువెళ్లాల్సింది సామాన్యులే మీరిచ్చే పది రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి కోటి రూపాయలు తీసుకున్న రాని సంతోషాన్ని ఇస్తుంది. ప్రజల కోసం పనిచేసే పార్టీకి మేమున్నాం అని తెలియజేయడమే ఈ నా సేన కోసం నా వంతు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని బత్తుల బలరామకృష్ణ గారు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి వారు మాట్లాడుతూ నాశన కోసం నా వంతు అనే కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులలో మన వంతు సహకారాన్ని అందించే మార్గమే నా సేన కోసం నా వంతు ఇందులో అందరూ భాగస్వాములు అవ్వాలని ఆశిస్తూ పాలచర్ల జనసైనికులు ఎల్లప్పుడూ ఇదే ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అని తెలియజేశారు.

బత్తుల బలరామకృష్ణ సమక్షంలో పాలచర్ల గ్రామం నుంచి అధికార పార్టీ రాక్షస పాలన వలన విసిగిపోయిన వైసీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరడం జరిగింది.

సూరపురెడ్డి రాజారావు నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి 50,000 రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో బత్తుల వెంకటలక్ష్మికి అందజేశారు. రాజానగరం నియోజకవర్గ నాయకులు పాలచర్ల వాస్తవ్యులు గంగిశెట్టి రాజేంద్ర గారు 20,000 రూపాయల చెక్కుని బత్తుల వెంకటలక్ష్మి గారికి అందించి ఆయన అభిమానాన్ని చాటుకున్నారు. తదుపరి పాలచర్ల జనసైనికులు తమ వంతుగా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నా సేన నావంతు కార్యక్రమానికి విరాళాలను అందించారు. ఈ కార్యక్రమంలో
సూరపురెడ్డి రాజారావు, గంగిశెట్టి రాజేంద్ర, నాతిపాము దొర, కురుమళ్ళ మహేష్, గళ్ళా రంగా, బోయిన వెంకటేష్, వేగిశెట్టి రాజు, వేమగిరి పండు, తోట అనిల్ వాస్, అడ్డాల దొరబాబు, బుద్దాల అర్జున్ రావు, సూరపురెడ్డి వాసు, కమిడిసత్తిబాబు, తిరుమలశెట్టి శ్రీను, ముక్కపాటి గోపాలం మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *