స్థాయి మరచి నిందలేల!!

  • ఉప్పు వెంకట రత్తయ్య
  • చింతా రేణుకారాజు

దత్తపుత్రుడు హోల్ సేల్ గా కాపు ఓట్లని అమ్మేస్తాడు అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండింస్తున్నామని గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు అన్నారు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి స్థాయి మరిచి కాపులని అవమానించేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడంపై తమ ఆవేదనని వారు వ్యక్తం చేసారు… జగన్ గారు ముందు ఎప్పుడన్నా ఇలాగే ఆయా కులాల దగ్గర గుంపగుత్తగా ఓట్లు కొనుక్కుని ముఖ్యమంత్రి అయ్యారా? లేక వారి రెడ్ల ఓట్లు గుంప గుత్తగా ఎవరికైనా అమ్మేసుకున్నారా? అని వారు నిలదీశారు.. కాపులను అమ్ముడు పోయే వ్యక్తులుగా కాపు జాతిని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాక్యాలను వెనక్కి తీసుకుని, కాపులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసినారు..

కాపులకు ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండువేల కోట్ల రూపాయలు విదేశీ విద్యా నిమిత్తం కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ 3 సంవత్సరాలగా 6 వేల కోట్లకు పైగా ఎక్కడ ఇచ్చారు అని వెంకటరత్తయ్య, రేణుకారాజునిలదీశారు.

కాపుల రిజర్వేషన్ కేంద్రం మా పరిధిలోలేదు అది రాష్ట్ర పరిధిలోనిది అన్నా వైసీపీ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్లు ప్రక్కన ఎందుకు పెట్టిందని, అలానే కాపునేస్తంలో 46వేలమంది పేర్లులిస్టు ఎందుకు గల్లంతయ్యిందని, అర్హులను ఎందుకు తొలగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అలాగే గాలి పార్టీ అధినేత గాల్లో వచ్చి, గాలి మాటలు మాట్లొడోద్దని హితవు పలికారు. మీరు మీటింగులు పెట్టుకుని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే సరిపోతుందా అంటూ దుయ్యబట్టారు.. మీలాగా మేము, మానాయకుడు ఆర్డిక నేరస్తూలమో, జైలుకెళ్లి వచ్చిన వ్యక్తులమో కాదని, అని వారు ఎద్దేవా చేసారు. మన రాష్ట్రంలో నేడు రైతులు పంటలు సరిగా పండక, పండిన పంటలకు సరిఅయిన గిట్టుబాటు ధరలు లేక సర్వం కోలిపోయి రైతులు కౌలుచెల్లించక దీనస్థితిలో వుండి ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు జనసేన పార్టి అండగా వుంటుందని తన స్వంత నిధులను ఇచ్చి రైతు కుటుంబంలలో వెలుగు నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ప్రజల సమస్యల్ని గుర్తించి నివారించేందుకు తన వంతుగా జనవాణి కార్యక్రమానికి స్వీకారం చుట్టి ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులను తేలియజేప్పే విధంగా ప్రజల పక్షపాతి పవన్ కళ్యాణ్ అని ఈసందర్భంగా వెంకటరత్తయ్య, రేణుకారాజులు గుర్తు చేశారు ..జనసేన పార్టీ రోజురోజుకూ రాష్ట్రంలో బలపడుతుంది అని పరిపాలన చేయడం చేతగాక వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అంటేనే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏవిధంగా భయపడుతున్నారో అర్థమవుతుంది అని ఉప్పు వెంకటరత్తయ్య, చింతా రేణుకారాజు శనివారం నాడు ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.. దయచేసి ఇలాంటి పసలేని ఆరోపణలను ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో మానుకోని ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి దృష్టి పెట్టాలని వెంకట రత్తయ్య, రేణుకారాజు హితువు పలికినారు.