ఘనంగా సీతారామ రజక సంఘం బల్లల పూజలు

డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, ఆదుర్రు గ్రామంలో సీతారామ రజక సంఘం బల్లల పూజలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ బోర్రపాలేపు సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు బిజేపి జిల్లా కార్యదర్శి పసుపులేటి మహాలక్ష్మి రావు, బిజెపి ఓబీసీ జిల్లా కార్యదర్శి మామిడి కుదురు మండల రజక సంఘం అధ్యక్షులు కోటిపల్లి సాయిబాబు, జనసేన పార్టీ మామిడికుదురు మండల కార్యదర్శి కాట్రేనిపాడు నాగేంద్ర, ఆదూరు రజక సంఘం ప్రెసిడెంట్ ఆదుర్తి జానకిరామయ్య, కోటిపల్లి శ్రీనివాస్, రామేశ్వరం సుబ్రహ్మణ్యం, కందివలస అప్పారావు, మొగలికుదురు వీర రాఘవులు, ఆదుర్రు కొండయ్య, ఆదుర్రు నరసింహమూర్తి, తెల్లాకుల శ్రీనివాస్, రజక సంఘం సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.