విషమంగా మారిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పటల్ లో ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ క్లాట్ తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం వెంటిలేటర్‌పై ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు గా తెలుస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లుగానే వైద్యులు తెలియజేసారు.