మాడుగుల జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

మాడుగుల నియోజకవర్గం, మాడుగుల కోడూరు జనసేన యూత్ మరియు జనసేన యువ నాయకులు రాయపరెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం జరుపబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఆంధ్ర గోల్డ్ మ్యాన్ ముక్క శ్రీనివాస్ రావు మరియు జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు కరణం నూకరత్నం కళావతి, కాపు సంక్షేమ సేన అనకాపల్లి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంజి, మహిళా ప్రధాన కార్యదర్శి దూడల సీతారామ పద్మలక్ష్మి, గొల్లవెల్లి కోటేశ్వర్ కాపు సంక్షేమ సేన చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి తాసుబిల్లి సునీల్ కుమార్ మాడుగుల నియోజకవర్గం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.