తమ్మి అప్పలరాజు దొర ఆద్వర్యంలో గిరి జనసేన ఆత్మీయ కలయిక

మంగళవారం విజయనగరం పియస్ఆర్ కాంప్లెక్స్ లో గిరి జనసేన ఆత్మీయ సభ జరిగింది. ఈసభకు ఉత్తరాంధ్ర నియోజకవర్గాలు గిరిజన ముఖ్య వ్యక్తులు పాల్గొన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పార్టీ అధినాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి గిరిజన ఎదుర్కొంటున్న సమస్యలు, కోల్పోయిన హక్కుల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గిరిజన గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి అలాగే పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలకు గిరిజన యువతకు పిలుపునివ్వడం జరిగింది, ఈ సందర్భంగా నూతనంగా విజయనగరం పారిశ్రామిక వేత గుర్రన్న అయ్యలు జనసేన పార్టీలో చేరడంతో ఆయన ను గిరిజనులు జనసేన నాయకులు ఆయనకు మర్యాద పూర్వకంగా సన్మానం చేయడం జరిగింది. గిరిజన ఆత్మీయ సభలో జనసేన పార్టీ కురుపాం నియోజకవర్గ నుండి జనసేన పంచాయతీ సర్పంచ్ గా గంగాధర్ కి చిరు సత్కారం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, దళిత నాయకుడు ఆధాడ మొహన్, విజయనగరం జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ రాజేంద్ర, గిరిజనులను ఉద్దేశించి గిరిజన చట్టాలు, హక్కులు గూర్చి ఐఖ్యత కొరకు జనసేన ప్రజలలోకి వెళ్ళాలని మాట్లాడారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన నాయకులు సాలాచన షణ్ముఖ రావు మన్యం జిల్లా వచ్చిన నాయకులు మీనక చిన్నారావు‌. అలాగే ఉత్తరాంధ్ర నాయకులు హక్కులు, చట్టాలు కోసం మాట్లాడుతూ జనసేన నియోజకవర్గాల్లో, గ్రామాల్లో జనసేన బలోపేతం చేయడానికి ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటలకు పల్ల సురేష్, తిమ్మక బాబూరావు, శివ‌, యువతీ యువకులు జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ఆదివాసీ హక్కులు కాపాడుకునేందుకు విలువైన సందేశం ఇవ్వడం జరిగింది.