జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గం, కొండవీడు గ్రామంలో కొండవీడు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో, జేఎస్పి రాయల్ సోల్జర్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో గుంటూరు నగరానికి చెందిన ఆదిత్య హాస్పిటల్ మరియు రోజా ఐ కేర్ వారి హాస్పిటల్స్ కి చెందిన డాక్టర్స్ గ్రామస్తులకు షుగర్, బిపి, గుండె, జనరల్ సమస్యలు, కంటి సమస్యలపై టెస్ట్ లు నిర్బహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజల అవసరాలను బట్టి మేము ముందుకు అడుగులు వేస్తామని, సమస్యల పరిష్కారం దిశగా తాము పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, పాకనాటి రమాదేవి, తోట వెంకట సాయికృష్ణ, కొండవీటి నరేంద్ర, ఎడ్రపల్లి సతీష్, అశోక్, ఆకుల సాయి, వెంకట్రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.