మంచినీటి సౌకర్యం కల్పించాలి: జనసేన డిమాండ్

అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ మండలం, పులిగడ్డ గ్రామంలోని 2,3,4 వార్డులలో మంచినీటి సౌకర్యం కల్పించాలని పులిగడ్డ గ్రామ జనసేన పార్టీ తరపున గ్రామ సర్పంచ్ దాసరి విజయ్ కు సోమవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు మాట్లాడుతూ.. జనంలోకి జనసేన కార్యక్రమంలో బాగంగా ఇంటింటికీ వెళ్లిన జనసేన శ్రేణులకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేయడంతో స్పందించిన అవనిగడ్డ మండల జనసేన శ్రేణులు జులై 1వ తేదీన పంచాయతీ సర్పంచ్ కు వినతి పత్రం అందజేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించక పోవడంతో సోమవారం మరొకసారి సర్పంచ్ గారికి వినతి పత్రం అందచేసి, త్వరలో పని పూర్తి చేయక పోతే పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపడతామని శేషుబాబు డిమాండ్ చేశారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశ చరిత్ర లో ఇంకా మంచినీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల కొసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం సిగ్గు చేటని జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు ద్వజమెత్తారు. జల జీవన్ మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తుండటం జరుగుతున్నా, మన నియోజక వర్గంలో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయంటే స్థానిక పాలకుల వైఫల్యం పూర్తిగా కనిపిస్తుందని జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. అతి త్వరలో పైప్ లైన్ ఏర్పాటు చేసి, ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించక పోతే స్థానిక ప్రజలను కలుపుకుని, నిరసన దీక్ష చేపడతామని గ్రామ పార్టీ అధ్యక్షులు మండలి ఉదయ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పన భాను, చెన్ను వాల్మీకి, మండలి రామ్ గోపాల్, మండలి నాగరాజు, మండలి నవీన్, భోగాది రాజ్యలక్ష్మి, బచ్చు కృషకుమారి, వార్డు మెంబర్ కమ్మిలి సాయి భార్గవ, తోట ఆంజనేయులు, గుడివాక రామాంజనేయులు, పప్పుశెట్టి శ్రీను, కమ్మిలి వేణు, కమ్మిలి రఘురత్న వర ప్రసాద్, బచ్చు శ్రీహరి, రేపల్లె లక్ష్మణ, ఫరీద్, దాసు, శంకర్, అప్పికట్ల భాస్కర్, ఆకుశెట్టి రవి, రాజేష్, ఉద్దండి అంజి, మాదివాడ కుటుంబరావు, చందు, బ్రహ్మం, బోగాది నవీన్ తదితరులు పాల్గొన్నారు.