విద్యుత్తు కోతలతో విసుగుచెంది సబ్‌స్టేషన్‌పై దాడికి దిగిన గంట్యాడ ప్రజలు

  • సమస్యను పరిష్కరించిన జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక: పెదగంట్యాడ గ్రామంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఉన్నటువంటి పవర్ స్టేషన్ (ఏపీఈపీడీసి)లో దాదాపు 8వ వార్డులలో విద్యుత్తు అంతరాయం కలగడం వల్ల చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్లు తీవ్ర ఇబ్బందిలకు గురువ్వడం జరిగింది. గంట్యాడ ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలందరూ పవర్ స్టేషన్ కి వచ్చి తీవ్ర గందరగోళం చేశారు. అక్కడే ఉన్న విద్యుత్ శాఖ అధికారి ఏఈ మీద దాడికి కూడా పాల్పడ్డారు. ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన 64వ వార్డు కార్పొరేటర్ జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి ఆ దాడిని ఆపడం జరిగింది. తర్వాత అధికారులతో మాట్లాడి దగ్గర ఉండి చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు.