తక్షణ సాయానికి జనసేన డిమాండ్

తణుకు నియోజవర్గం ఇరగవరం మండలం కోడవల్లి, కె.కుముదవల్లి గ్రామాలలో అకాల వర్షంతో పాడైపోయిన వరిచేలను నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు పరిశీలించారు. తక్షణ సాయంగా 20 వేల రూపాయలు అందించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. కుముదవల్లి గ్రామ ఎంపీటీసి పిండి గోవింద్ రాజు, ఇరగవరం మండల పార్టీ అధ్యక్షులు ఆకెటి కాశీ, తణుకు మండల పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, అత్తిలి మండల అధ్యక్షులు దాసం ప్రసాద్, తణుకు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.