రాముడి కోసం నిధి సేకరణ

అయోధ్య రామమందిరం కోసం నిధి సేకరణ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ఉదయం 10 గంటలకు బోరబండలో ప్రారంభించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ ఆధ్వర్యంలో జనజాగరణ ద్వారా నిధి సేకరణ జరుగనుంది. ఫిబ్రవరి 17వరకు నిధి సేకరణ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొననున్నారు. రాముడు గుడి కోసం బీజేపీ నేత తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒక్క ఇటుకైనా ఇచ్చి ప్రతి హిందువు రామమందిరం నిర్మాణం భాగస్వామ్యం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.