జి.మాడుగుల, చోడవరం మండల నాయకులతో గంగులయ్య సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య పార్టీ బలోపేతనికి క్రియాశీలంగా సూచనలు, సలహాలు, దిశానిర్దేశం, అనుచరించాల్సిన వ్యూహాల కోసం పాడేరు, జి.మాడుగుల, చోడవరం మండల నాయకులతో చర్చించారు. ఈ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, జి.మాడుగుల జనసేనపార్టీ యూత్ అధ్యక్షులు మస్తాన్, చోడవరం మండల ఉపాధ్యక్షులు గణేష్, అశోక్ కిల్లో, మత్స్యబాబు, అశోక్ సాలేబు తదితరులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.