రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు: అంజూరు చక్రధర్

చిత్తూరు, రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటిది దేశానికి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు రైతు పడుతున్న కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది. దుక్కి దున్నిన నాటి నుండి పంటను అమ్మి డబ్బు చేతికొచ్చే వరకు రైతుకు ప్రభుత్వం అండగా నిలవాలి. కానీ ఏపీలో పంటను అమ్ముకోవడం కోసం, ధాన్యం డబ్బుల కోసం… ఇలా ప్రతి రోజూ రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన దుస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ సాయం, పంటలకు కనీస మద్ధతు ధర లేక వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీంతో ఏపీలో 93 శాతం మంది రైతులు రుణభారంలో మునిగిపోయారు. రుణభారంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటిస్థానంలోకి నెట్టారు. దీనివల్ల ఆత్మహత్యల్లో కౌలు రైతులు 2వ స్థానంలో, రైతులు ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో ఉన్నారు. వరి పంట వేయొద్దని ప్రభుత్వమే చెప్పడం రైతులను అవమానించడమే. కౌలు రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. కనీస మద్ధతు ధరకు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసి వెంటనే నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున కోరుచున్నానని అంజూరు చక్రధర్ తెలిపారు.