మిర్చి కల్లాల పరిశీలించిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మండలం, నగర పంచాయతీ ఏరియాలో రైతులు ఎండబెట్టిన మిర్చి కల్లాల పరిశీలించిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. గాదె మాట్లాడుతూ ఈ అకాల వర్షాల వల్ల రైతుల పడుతున్న ఇబ్బందులను చూస్తే హృదయ విధారకంగా మారుతుంది. ఈ వర్షాల దాటికి కల్లాలలోకి పైనుంచి నీరు కారగా వాటిని మిర్చి కావచ్చు, జొన్న పంట గాని కాపాడుకునే ప్రయత్నాలలో నీటిని ప్రోక్లైనర్ తో నీటిని తోడే పరిస్థితిలో రౌతులు ఉన్నందుకు చాలా సిగ్గు చేటు. శివ అనే కుర్రాడు గత మూడు రోజుల నుంచి అన్నం కూడా తినని పరిస్థితి అతను ఐదు ఎకరాల కౌలు తీసుకొని ఎంత వస్తుందో తెలియక చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ ప్రభుత్వం పేపరు ప్రకటనలు బాగా ఆర్భాటాలు ఇచ్చే ఈ వైసీపీ ప్రభుత్వం అకాల వర్షాల వలన దెబ్బతిన్న పంటలను కానీ కల్లాల వద్దకు గాని ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని ప్రభుత్వ అధికారి గాని ఇప్పటి వరకు వచ్చిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం రైతులు మేలు కోరే ప్రభుత్వాన్ని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి కానీ ప్రతి సంవత్సరం ఏ ఒక్క రైతు పంటని పూర్తిగా అనుభవించిన రోజు లేదు ప్రతి సంవత్సరం ఏదో విధంగా నష్టం జరుగుతూనే ఉంది కానీ ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకున్న దాఖలాలు ఏమీ లేవు. ప్రజలు నీకు ఓట్లు వేసినందుకు అనుభవిస్తున్న బాధలు చాలు వారికి న్యాయం చేయండి నిజమైన నష్టపోయిన రైతుని గుర్తించి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి మీ పార్టీలో ఉన్న వ్యక్తులకు కాకుండా అందరినీ సమాను దృష్టిలో చూడండి. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. మీరు ఎక్కడో ఒక చోట కూర్చొని బటన్ నొక్కుతూ ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని పేపర్ యాడ్స్ కే పరిమితం అవుతున్నారు.జీవో నెంబర్ ఒకటిని గట్టిగా అమలు చేయాలని ప్రభుత్వ అధికారులకు చెప్తున్నారు. ఈ గురజాల నియోజకవర్గంలో సెల్ఫీ చాలెంజ్లు చేసుకుంటున్న ప్రస్తుత ఎమ్మెల్యే గత ఎమ్మెల్యేలు మీరు ఏమి ఉద్ధరించారు నాయనలారా మీరు ఇష్టానుసారంగా 100 అడుగులు లోతుగా క్వారీలు తవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకోండి గతంలో అతను 100 అడుగులు తోవ్వేడని ప్రస్తుత ఎమ్మెల్యే 200 అడుగులు తవ్వారు అని పోటీ పడండి. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చలకు మేము సిద్ధం మీరు రండి వారానికి ఒకసారి వచ్చి ఆర్ అండ్ ని బంగ్లాలో కూర్చొని కమిషన్స్ వసూలు చేసుకోవడం తప్ప మీరు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. జగన్ రెడ్డికి ఒకటే చెబుతున్నాం తక్షణమే మీ ఎమ్మెల్యేలను బయటికి వచ్చి ఇలా అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను దగ్గరకు వచ్చి పాడైపోయిన పంటలను చూసి వారికి తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము లేని పక్షంలో తాడేపల్లిలో నీ ఇంటికి వచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు కమిటీ సభ్యులు, జనసైనికులు మరియు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.