మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా తునిలో యాచకులకు అన్నదానం

తుని నియోజకవర్గం: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం తుని నియోజకవర్గ ఐటీ కో ఆర్డినేటర్ బుసాల మణిబాబు, బెండపూడి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కోరుకొండ శివ ఆధ్వర్యంలో అన్నవరంలో 80 యాచకులకు భోజనాలు పంచడం జరిగింది. జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షులు మరియు తొండంగి జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాయుడు, తొండంగి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బుసాల సతీష్, బెండపూడి గ్రామ కమిటీ సభ్యులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.