Palakonda: మున్సిపల్ కమీషనరుకి వినతిపత్రం సమర్పించిన గర్భాన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గం, పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ పరిష్కారం కోసం స్థానిక మున్సిపల్ కమీషనర్ శ్రీ నడిపేన రామారావుని జనసేన పార్టీ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు కలిసి ఆ సమస్యను వివరించి తెలియచేసి వినతిపత్రం సమర్పించారు. కమీషనర్ సానుకూలంగా స్పందించి ఆ సమస్యను అతిత్వరలోనే పరిష్కారిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడికక్కడే అధికారులను పిలిపించి డ్రైనేజీ, వీధి లైట్లు మరియు సానిటీజషన్ సమస్యలు గురించి సోమవారం లోగా పరిష్కారించమని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తోటి జనసైనికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.