చిత్తూరులో గ్యాస్ లీకేజీ

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలోని బందపల్లి హాట్సన్ డైరీ లో అమోనియా గ్యాస్ లీకేజీ జరిగింది.  సమాచారం ప్రకారం గ్యాస్ ప్రభావంతో 12 మందికి పైగా  స్పృహ కోల్పోయారు అని సమాచారం. గ్యాస్ ప్రభావానికి గురి అయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది కోలుకున్నారు.

ఇక ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఈ మేరకు 13 మంది పేర్లను ప్రకటించారు. ఈ 13 మందిలో 12 మంది మహిళలే ఉన్నారు.  హాట్సన్ డైరీ గ్యాస్ లీక్ గురించి  మాట్లాడిన పూతల పట్టు ఎస్ ఐ లీకేజీని అదుపులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.