కోయంబత్తూరు ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించిన గిరడా అప్పలస్వామి

బొబ్బిలి నియోజకవర్గం: బతుకుతెరువు కోసం తమిళనాడు రాష్ట్రానికి వలస కూలీలుగా వెళ్లిన వారిని మృత్యువు కబలించింది. కోయంబత్తూరులో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల ప్రహరీ కూలి విజయనగరం జిల్లా, వీరసాగరం గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. శుక్రవారం బాధిత కుటుంబాలను బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడా అప్పలస్వామి పరామర్శించి, ఆ కుటుంబాలకు ధైర్యాన్ని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కంపెనీ మేనేజమెంట్ తో మాట్లాడి కంపెనీ నుండి ఆర్థిక సహాయం కోరడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేతో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్, భీమా, ద్వారా తక్షణ సహాయం అనేది ప్రభుత్వం నుండి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మూ గణేష్, గొర్లె తవిటినాయుడు, గొర్లె సాయి, శ్రీనివాస్ బొబ్బిలి, బాడింగి మండలం జనసైనికులు పాల్గొనడం జరిగింది.