గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 25వ రోజు

పాలకొండ, గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 25వ రోజులో భాగంగా వీరఘట్టం జనసైనికులతో సమావేశం అవ్వడం జరిగింది. జనసేన జానీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల16వ తేదీన ఆదివారం జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉదయం 9గంటలకు జనవాణి కార్యక్రమం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేయడం జరుగుతుందని, జనసేన జానీ చెప్పడం జరిగింది. అలానే శుక్రవారం పాలకవర్గ నాయకులు చేస్తున్న నూతన పాలసీలు వలన ప్రజలు చాలా ఎలా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు సుదీర్ఘంగా చాలా సమస్యలతో బాధపడుతున్నారని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళిన వారి సమస్యలను పెడచెవిన పెడుతున్నారు, అని చెప్పడం జనసేన జానీ జరిగింది. మత్స పుండరీకం మాట్లాడుతూ వ్యాపారవేత్తలు ఆర్థిక బలం ఉన్న వ్యక్తులు వలన పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని ఓదార్చి వారి సమస్యపై పరిష్కార మార్గంగా తీసుకెళ్లి నాయకులు చాలా అరుదుగా ఉన్నారని ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఒక్క పవన్ కళ్యాణ్ గళం మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారని, పవన్ కళ్యాణ్ దృష్టికి పాలకొండ నియోజకవర్గం నాలుగు మండలం సమస్యలుని నియోజకవర్గం జనసేన నాయుకులు జనసైనికులు దృష్టికి తీసుకు వచ్చినట్లు అయితే జనవాణి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఒక సమస్య పరిష్కారం దిశగా చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నెన సాయిపవన్, దత్తి గోపాల్, సొండి సుమన్, బొమ్మాళి వినోద్, దూసి ప్రణీత్, జరాజపు రాజు పాల్గొన్నారు.