పురంధేశ్వరిని మర్యాద పూర్వకంగా కలిసిన కొట్టె మల్లికార్జున

డోన్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎన్నికల వేడి మొదలైంది అనే విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుంది అని మీడియా వేదికగా హల్ చల్ చేసినప్పటికీ, ఎట్టకేలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి త్రిముఖ కూటమి బిజెపి, జనసేన మరియు టిడిపితో పొత్తుకు సిద్ధము అయి అధికార నియంతృత్వ పాలనను గద్దె దించడానికి సన్నద్ధం అవుతూ 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తూ కూటమి భాగస్వాములను గెలిపించే బాధ్యతను పార్టీ నాయకులు కార్యకర్తలు, శ్రేణులు తీసుకోవాలని ఏపీ ఎన్నికల ఇంఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఏపీ బిజెపి పెద్దలు దిశా నిర్దేశనం చేశారు. బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ బిజెపి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి అమ్మను మర్యాద పూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియచేసి శాలువాతో సత్కరించడం జరిగింది అని పేర్కొన్నారు. భవిష్యత్ లో డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో సముచిత స్థానం కల్పిస్తాం, బిజెపి పార్టీ బలోపేతం కోసం, 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పురంధేశ్వరి అమ్మ తెలిపారు. సివిల్స్ సర్వీసెస్ ప్రిపరేషన్ తర్వాత, గత 4 సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన నాకు తగిన గుర్తింపు బిజెపి పార్టీలో కల్పిస్తాం అని పురంధేశ్వరి అమ్మ ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ ప్రభుత్వ పరిపాలన విధానాలను మరియు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలనపై చేసిన మీడియా డిబేట్స్ ను చూసి, భవిష్యత్ లో స్పోక్ పర్సన్ గా అవకాశం కల్పిస్తాం, తగిన గుర్తింపు ఇస్తామని పురంధేశ్వరి అమ్మ పేర్కొన్నారని మల్లికార్జున మీడియాతో తెలిపారు. భవిష్యత్ లో డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి పార్టీ బలోపేతం కోసం కృషి చేయడమే కాకుండా, బిజెపి జెండా డోన్ గడ్డ పై ఎగరేసేలా సీనియర్ నాయకులు, యువకులను కార్యకర్తల్ని కలుపుకొని ముందుకు వెళ్తాను మా లాంటి ఉన్నత విద్యా వంతులకు, యువనాయకులకు అవకాశం ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించినఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున కృతజ్ఞతలు తెలిపారు.