గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 5వ రోజు కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం గదభవలస పంచాయతీ గిరిజన ప్రజలను కలిసిన వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ ప్రజావాణి, రైతు భరోసా యాత్ర, జనసేన పార్టీ మేనిఫెస్టో క్రియాశీలక సభ్యత్వం గురించి మహిళలకు, యువతకు, పెద్దలకు, తెలియజేసారు. గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమం ద్వారా ప్రజ దగ్గరకు వెళ్ళి గ్రామంలోని ప్రధాన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజావాణి ద్వారా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లి పరిష్కరించేవిధంగా కృషి చేస్తామని తెలిపారు. మీ గ్రామ పంచాయతీ నుండి పవన్ కళ్యాణ్ చేపట్టిన “జనవాణి జనసేన” కార్యక్రమంలో మీ గ్రామ పంచాయతీ సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చేందుకు త్వరలో విశాఖపట్నం జరుగు కార్యక్రమానికి రావాలని కోరారు. జనసేన జానీ మాట్లాడుతూ గదభవలస గ్రామ ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర చేపట్టారు 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్ను కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జనసేన పార్టీని గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కొండల్లో, కొనల్లో జీవిస్తున్న మాకు, మా ఊరి సమస్యలుగురించి తెలుసుకోడానికి వచ్చిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని గదభవలస గిరిజన ప్రజలు జనసైనికులతో అన్నారు. కర్ణేన సాయి పవన్ గ్రామ ప్రజలలో జనసేన పార్టీ పట్ల అపూర్వ ఆదరణ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు రాజు, దూసి ప్రణీత్, బి.పి నాయుడు, వావిలపల్లి నాగభూషన్, దండేల సతీష్, కంటు మురళి తదితరులు పాల్గొన్నారు.