బొబ్బిలిలో ఘనంగా రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు

బొబ్బిలి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం బొబ్బిలిలో స్థానిక విజేత స్కూల్లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 72 మంది యువకులు యువతులు రక్త దానం చేశారు. ఈ కార్యక్రమం మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ లంక రమేష్, వీరమహిళలు దివ్య, లక్ష్మి, బంటుపల్లి శంకర్, సాయి మరియు అవేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెద్దింటి మనోజ్ ఆధ్వర్యంలో జరిగింది. మెగా అభిమానులు కేక్ కట్ చేసి రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో మెగా అభిమానులు తెంటు రమేష్, సందీప్ తదితర అభిమానులు పాల్గొన్నారు.