అభివృద్ధి కోసం జనసేన కు ఒక అవకాశం ఇవ్వండి: రామ శ్రీనివాస్

రాయచోటి: అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణ పరిధిలో ఉన్న సమస్యలను ఉద్దేశించి జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లా కేంద్రం అవ్విన రాయచోటి పట్టణంలో మురికి కాలువలు, సి సి రోడ్లు అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా మిగిలిపోయింది. అలానే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ పాడైపొయి తేలికపాటి వర్షానికే రోడ్లు అధ్వానంగా అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా మారి ప్రయాణ రాక పొకలకు స్థానికులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలుగా చిన్న పాటి అభివృద్ధి పనులు చేపట్టిన పాపాన పోలేదు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రజలు ఆయన మీద నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యత కూడా పక్కన పెట్టి ఆయన వ్యక్తిగత స్వార్ధ రాజకీయలబ్ది, ఆయన సొంత వర్గీయుల అభివృద్ధి విషయంలో వున్నంత శ్రద్ద నియోజకవర్గ అభివృద్ధి విషయంలో లేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిధులు మంజూరు చేసినా ఆ నిధులను అభివృద్ధి అవసరాలకు కాకుండా పక్క దారి మళ్ళించిన కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లు అక్కడే నిలిచిపోయింది. వారి మాటల్లో మాత్రం అభివృద్ధి పదాలు అద్భుతంగా ఉంటాయి, చేతలకు వచ్చే సరికి కంటి చూపు మేర ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికైనా పాలకులు, ప్రజలు, ఓటు ద్వారా అప్పచెప్పిన బాధ్యతను గుర్తెరుగుతారని, అలానే అధికారులు కూడా ప్రజా సమస్యలపై వారి అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వండి ప్రజా సంక్షేమ అభివృద్ధి అనేది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయచోటి అసంబ్లీ జనసేన ఇంచార్జ్ షేక్ హసన్ భాష, జిల్లా కార్యక్రమాల సభ్యులు షేక్ రియాజ్, నాయకులు, జనసైనికులు, స్థానికులు పాల్గొన్నారు.