నిండా మునిగిన కంచ కోడూరు రైతులు

పెడన: ఇటీవల కురిసిన వర్షాలతో గూడూరు మండలం, కంచ కోడూరు గ్రామంలో చేతికొచ్చిన పంట పొలాలు మునిగిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి కోత అయ్యి, వరి పనలు నీటిలో మునగడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల మినుము పైరు పూర్తిగా కూడా దెబ్బతింది. వర్షం నీరు పోయేటందుకు మురికి కాలువలు సరిగా లేకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బత్తిన హరి రామ్, ఎస్ వి బాబు, గంటా రవి, గుడివాడ రాజా, ఉడుముల ప్రతాప్, మున్నా, శీరం సంతోష్, గల్లా హరీష్, కనపర్తి వెంకన్న, సీట్ల నవీన్ కృష్ణ, దాసరి నాని, పినిశెట్టి రాజు, ఒగ్గు సాయి, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.