ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఇల్లు కట్టుకోడానికి గడువు పెంచండి

  • జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు

విజయనగరం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారికి స్థానిక సమస్యలపై వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పట్టణంలోను మరియు ఇతర నియోజకవర్గాల్లో రోడ్లు పరిస్థితి గోతులమయంతో చాలా ఆద్వానంగా తయారైందని, వీటివల్ల చాలా మందికి ప్రమాదలకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నారని, అలాగే పట్టణంలో పందులు, కుక్కలు కూడా ఎక్కువ సంఖ్యలో పట్టణంలో తిరిగుతూ ప్రజలకు చాలా భయాందోళనకు గురవుతున్నారని వాపోయారు. ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు నిర్మించుకోలేకపోతే వాటిని రద్దు చేస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని, విపత్కర పరిస్థితుల్లో, కరోనా వలన లాక్ డౌన్ అనంతరం చాలా మంది ప్రజలు ఉపాధి లేక చాలా ఆర్ధికంగా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలు మరింత ఇబ్బందులు గురవుతున్నారని, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని, ఇళ్ళు కట్టుకోడానికి గడువుపొడిగించి మరో అవకాశం కల్పించాల్సిందిగా జనసేన పార్టీతరుపున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు డోల రాజేంద్ర ప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిడతాన రవికుమార్, వంక నరసింగరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు), సాయి, అనిల్, శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.