పవన్ కళ్యాణ్ తోనే యువతకు బంగారు భవిష్యత్తు: ఆళ్ళ హరి

గుంటూరు: దశాబ్దాల కాలంగా రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ వచ్చారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. గురువారం స్వామి వివేకానంద 160 వ జయంతి సందర్భంగా శ్రీనివాసరావు తోటలోని గాజు గ్లాసు దిమ్మె వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఉక్కు నరాలు, ఇనుప కండరాలు ఉన్న యువత కోసం స్వామి వివేకానంద పరితపించారన్నారు. ఏ దేశానికైనా వెన్నుముక యువతేనని, జాతికి తరగని ఆస్తి యువతరమేనని అలాంటి యువత భవిష్యత్ ను నేటి రాజకీయ నేతలు అగమ్యగోచరంగా మార్చారని విమర్శించారు. యువత ఎక్కువ శాతం ఉన్న మన రాష్ట్రంలో యువతకు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తగినంత ప్రోత్సాహం లభించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే యువతకు అండగా నిలుస్తూ వారిలో దాగున్న నిగూఢమైన శక్తిని బయటికి తీసే బృహత్తర కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ యువశక్తి వేదికగా శ్రీకారం చుట్టారన్నారు. యువశక్తి వినియోగం ద్వారా యువతకు బంగారు భవిష్యత్తును అందించటమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, నగర కార్యదర్శి మెహబూబ్ భాషా, కోనేటి ప్రసాద్, గోపిశెట్టి రాజశేఖర్, వడ్డె సుబ్బారావు, బిల్లాల హేమంత్ కుమార్, ఆళ్ళ సాయి తదితరులు పాల్గొన్నారు.