చాడ్విక్ బోస్మాన్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

హాలీవుడ్‌కు చెందిన ప్రసిద్ధ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల 78 వ ఎడిషన్ ఆదివారం ప్రారంభమైంది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం వర్చువల్‌గా అందజేశారు. మోషన్ పిక్చర్ డ్రామా విభాగంలో ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రానికి దివంగత చాడ్విక్ బోస్మాన్ ఉత్తమ నటుడు అవార్డును గెల్చుకున్నాడు. టీవీ నాటక విభాగంలో ‘ది క్రౌన్’ ఉత్తమ సిరీస్‌గా ఎంపికైంది. ఈ సిరస్‌ ఉత్తమ టీవీ నటి, ఉత్తమ టీవీ నటుడు, ఉత్తమ టీవీ సహాయ నటి అవార్డులను కూడా సొంతం చేసుకున్నది.