ఎంసెట్ రాసిన తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త

తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త. ఎంసెట్‌-2020 ర్యాంకుల కేటాయింపులో గందరగోళం ఏర్పడింది. ఇంటర్‌ ఉత్తీర్ణత పొంది ఎంసెట్‌లో అర్హత పొందినా ర్యాంకులు దక్కలేదు. దీంతో విద్యా ర్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.  ఈ నేపధ్యంలో ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంసెట్ ర్యాంకులలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫామ్‌లో హాల్ టికెట్ నెంబర్‌ను తప్పుగా నమోదు చేసుకున్నవారికి ర్యాంకులు ఇవ్వలేదన్న ఆయన.. ఈ రోజు హాల్ టికెట్ సరిచేసుకున్నవారికి రేపు ఉదయంలోగా ర్యాంకులు ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా హాల్ టికెట్ సవరణకు జేఎన్టీయూ వరకు రావాల్సిన అవసరం లేదని.. ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చునని గోవర్ధన్ తెలిపారు.