థియేటర్లలోనే గోపీచంద్ ‘సీటీమార్’

గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్లో తాజాగా రూపొందిన సినిమా ‘సీటీమార్’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మించిన ఈ సినిమాలో, కథానాయికగా తమన్నా అలరించనుంది. క్రీడా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని చాలాకాలమే అయింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. దాంతో ఈ సినిమా విడుదల విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్ రావడం వలన నిర్మాతలు ఆ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఇక ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చెబుతూ, ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తామని చెప్పారు.