ఓటీఎస్ పేరుతో పేదలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రభుత్వం-అంజూరు చక్రధర్

చిత్తూరు జిల్లా, గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్లకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ క్రింద వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు దోచుకోవడాన్ని, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ ఓటిఏస్ పేరుతో నగరపాలక సంస్థ పరిధిలో 20 వేల రూపాయలు, పంచాయతీ పరిధిలో 10వేల రూపాయల చొప్పున వెంటనే చెల్లించాలని వాలంటీర్లకు సర్క్యూలర్లు జారీ చేసి మరి సామాన్య ప్రజల ముక్కు పిండి వసూలు చేయడం సరికాదన్నారు.కట్టని యెడల ప్రభుత్వ పథకాలు తగ్గుతాయని అధికారులు భయపెడుతున్నారని మండిపడ్డారు. నవరత్నాల్లో పేదలకు సెంటు భూమి మంజూరు చేసిన వైసీపీ ప్రభుత్వం 1983 నుంచి గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ క్రింద డబ్బులు వసూళ్ళు చేయడం సిగ్గుచేటన్నారు.

రెండేళ్లుగా కరోనా కారణంగా సరైన ఉపాధి అవకాశాలు లేక, గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెప్పతిని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని. అంతంత మాత్రంగా జీవితాలు గడుపుతున్నా పేదలపై ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పెనుభారం మోపుతోందన్నారు. పేదల సంక్షేమమే ద్యేయంగా నవరత్నాలు అమలు చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం ఓటీఎస్ పేరిట అదే పేద ప్రజల పొట్టకొట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఓటీఎస్ ని రద్దు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.