పేదవాడి సొంతింటి కల నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం: మనుబోలు మండలం, కొమ్మలపూడి పంచాయతీ నందు అదివారం జగనన్న ఇళ్ల స్థలాలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. కొమ్మలపూడి పంచాయతీ పరిధిలో జగనన్న ఇళ్ల ప్లాట్లను జగనన్న లేఔట్ గా వేయడం జరిగింది. లేఆఔట్ వేసి రెండున్నర సంవత్సరాలు అవుతుంటే ఇప్పటివరకూ రోడ్లు వేయడం గానీ, గ్రావెల్ తోలించడం గాని, పేదవాడి సొంత ఇంటి కలని నెరవేర్చాలని ఆలోచన కానీ వైసీపీ నాయకులకు లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో జగనన్న లేఔట్లకి గ్రావెల్ తోలుతాం అని చెప్పి పర్మిషన్ తీసుకోవడం, గ్రావెల్ మాత్రం నెల్లూరు నగరంలో పెద్దవాళ్ల ప్లాట్లకి అమ్ముకోవడం, ఆ డబ్బుని వాళ్ళ ఖాతాలో వేసుకోవడం తప్ప పేదవాడి ఇళ్ల స్థలాలకి గ్రావెల్ తోలిన పరిస్థితులు లేవు. అదేమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, 151 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 22 మంది ఎంపీలు కావచ్చు రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేశాం. పథకాల రూపంలో ప్రజల్ని ఆదుకున్న ఉయ్యాల ఊపుతున్న అని చెప్పుకుంటున్నారే తప్ప ఎక్కడా కూడా వీళ్లు చెప్పిన వాగ్దానాలు కావచ్చు, వీళ్ళు నెరవేర్చిన పథకాలు కావచ్చు, పూర్తిస్థాయిలో ఎక్కడా కూడా ఎవరికీ కూడా అందలేదు. దానికి నిదర్శనం జగనన్న కాలనీలే. వైసీపీ నాయకులు కొంతమంది ఊర్లు ఊర్లు నిర్మిస్తున్నారు జగనన్న అని చెప్పుకున్నారు. నిర్మించడం అంటే నాలుగు రాళ్లు నాటేసి లేఔట్ అని చెప్పుకొని పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తుంది అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో పేదవాడి సొంత ఇంటి కలని నెరవేర్చిన దాఖలు లేవు. #failure of jagananna colony భారతదేశంలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎవరంటే మా జగ్గు భాయ్ కోట్ల రూపాయల అవినీతిపరుడు. ఎవరయ్యా అంటే మా జగ్గు భాయ్ కింద 33 కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే మా జగ్గు భాయ్ భారత దేశంలో నెంబర్ వన్ కేటుగాడు ఎవరయ్యా అంటే మా జగ్గు భాయ్ ప్రజలు ఇకనైనా కళ్ళు తెరవండి. నీతి నిజాయితీగల నాయకుడిని ఎన్నుకుందాం. అవినీతి లేని పరిపాలన రాష్ట్ర అభివృద్ధిని యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుందాం రాబోయేది జనసేన కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఖాజా, సంజు రాకేష్, వంశీ, సాయి, జాన్, కార్తీక్, శ్రీను, కిరణ్, దినేష్, చందు, రియాజ్, గోవర్ధన్, హరి, కళ్యాణ్, పవన్, ప్రసాద్, అశోక్, మదన్, గురవయ్య, సురేష్, హరీష్, పండు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.