మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల అవినీతిపై విచారణ జరిపించాలి: త్యాడ రామకృష్ణారావు (బాలు)

*ఇంజనీరింగ్ అధికారులపై విచారణ జరిపించాలని కలెక్టర్ కు గ్రీవెన్స్ లో వినతి

*ఇంతవరకు జరిగిన పనులపై విజిలెన్స్, ఎన్ ఫోర్స్మెంట్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్

*సగంలో నిలిచిపోయిన, ఇంకా ప్రారంభంకాని పనులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్

విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న నాణ్యత లేని పనులు, ఇంజినీరింగ్ అధికారుల అవినీతిపై విచారణ జరిపించాలని సోమవారం ఉదయం జరిగిన కలెక్టరేట్ గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. సూర్యకుమారి కు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) వినతిపత్రాన్ని సమర్పించారు.

అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి చేయని, సగంలో పనులు నిలిపివేసి నగర పాలక సంస్థకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, నష్టాలను కల్పిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడమే కాకుండా.. సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.

అగ్రిమెంట్ ప్రకారం పనులను పూర్తి చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు జరిగిన పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

నాణ్యత లేకుండా మయూరి జంక్షన్ నుంచి సీఎంఆర్ జంక్షన్ వరకూ జరుగుతున్న సెంట్రల్ డివైడర్, రోడ్డు పనులపై విచారణ జరిపించాలని.. అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి చేయని ఈ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సాంకేతిక నైపుణ్యం లేని వర్క్ ఇన్ స్పెక్టర్లను అభివృద్ధి పనుల పర్యవేక్షణ నుంచి తప్పించి, ఖాళీగా ఉన్న నగర పాలక సంస్థ ఇంజనీర్ పోస్టును భర్తీ చేయాలని అన్నారు.

వార్డు ఎమినిటీ కార్యదర్శుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని, నగరంలో సగంలో నిలిచిపోయిన పనులను, ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని.. లేనిపక్షంలో జనసేన పార్టీ దీనిపై ఉద్యమం చేసి పనులు పూర్తియ్యేటట్లు చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సారికి మురళిమోహన్, బూర్లి వాసు, చెల్లూరి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.