కరోనా సమయంలో ప్రజలను కాపాడిన వారి సేవలను ప్రభుత్వం మరువకూడదు: అనుశ్రీ

రాజమహేంద్రవరం, పాదయాత్రలో ముద్దులు పెట్టి హామీలు ఇచ్చిన జగన్ అధికారం చేపట్టాక అందరినీ మోసం చేశారని అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన చేపట్టిన మున్సిపల్ కార్మికులకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్చార్జి అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ మరియు జనసైనికులు తన మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్తితుల్లో విశిష్ట సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడిన ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించడం నిజంగా చాలా బాధాకరమన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఆర్థిక అంధకారంలోకి రాష్ట్రాన్ని నెట్టారని విమర్శించారు. రేపు రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై వైసీపీ సర్కారును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల కోసమే రాజకీయ పార్టీని స్థాపించిన పోరాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వైవిడి ప్రసాద్ ఉపాధ్యక్షులు దాసరి గురునాధరావు ప్రధాన కార్యదర్శి షేక్ బాషా లిమ్రా, సిటీ కార్యదర్శి విన్న వాసు, మరియు జనసేన నాయకులు విక్టరీ వాసు, విజయ్ అక్కిరెడ్డి ప్రసాద్ విజయ్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.