జీడి మరియు వరి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు

  • పలాస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు హరిశ్ కుమార్ శ్రీకాంత్

పలాస: జీడి మరియు వరి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని పలాస నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు హరిశ్ కుమార్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం హరిశ్ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ సారి వరి పంటలు సమయానికి వర్షాలు పడక పొలాలకు నీరందక నియోజకవర్గంలో పూర్తిగ రైతులు నష్టపోయారు. చాల చోట్ల పొలాలు ఎండిపోగా కొన్ని చోట్ల అరకొర నీరుతో పంటలు పండిన కనీసం దిగుబడి పడిపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. నెల క్రితం ప్రభుత్వాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని జనసేన పార్టీ తరుపున ఆర్.డి.ఓ ద్వారా విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు అలానే నిరంతర సమస్యగా మారిన జీడి పంటకు మద్దతు ధర నేటి వరకు ప్రభుత్వం పరిష్కరించకపోవడం ప్రభుత్వం జీడి రైతుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ జనసేన పార్టీ ఆదివారం వరి/ జీడి రైతుల పక్షాన నిరసన బాట పట్టింది అని హరిశ్ కుమార్ శ్రీకాంత్ అన్నారు. ఈ సారి రైతులకి కన్నీటి సంక్రాంతి మిగిల్చింది అని వరి రైతులుకి కనీసం కరువు మండలంగ ప్రకటించలేదు ఇప్పటి వరకు అని సీనియర్ నాయకులు కోన కృష్ణ రావు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ ప్రభుత్వం వచ్చిన నటి నుండి జీడి రైతులకి మద్దత్తు ధర లేదు అని రైతులు ఇంకా కొలిపోవడానికి ఏమి లేదు అని అందుచేత పొట్టకుడు కోసం రైతులు కులీలుగా మరి వలసలు పోతున్నారు అని వజ్రపుకొత్తూరు మండలం జనసేన-బీజేపీ కూటమి జడ్పీటీసీ ఆభ్యర్ధి పూక్కల శ్రీదేవి ఉమా శంకర్ అన్నారు. ఆఫ్ షోర్ జలాశయం పనులు పూర్తి చేసివుంటే కొన్ని వేల ఎకరాలు పలాస మండలంలో సస్యశామలం అయ్యుండేవి అని పలాస మండల నాయకులూ దిలీప్ పాత్రో అన్నారు. ప్రభుత్వం జీడీ/వరి రైతుల సమస్యలు కానీ పరిష్కరించకపోతే సంక్రాంతి తరువాత ఉద్యమం మరింత తీవ్రతం చేస్తాం అని మందస మండల నాయకులూ తెలుకుల సందీప్ అన్నారు. ఈ కారిక్రమానికి విచ్చేసిన వారిలో పలాస జనసేన నాయకులు వంశి చౌదరి, మందస మండల ఉపాధ్యక్షులు సవర శివ, కారిక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు సందీప్, గిరీష్, ఉదయ్ కిరణ్, దీన బంధు, సతీష్, శ్రీకాంత్, చరణ్, ప్రశాంత్, నితిన్, శివ, పవన్, శ్యామ్, దీలిప్, నాగు, మని, సాయి, నవీన్, దను, హేమంత, శంకర్, నరేంద్ర, హేమంత్, ఉల్లాసపేట శ్రీను, సతీష్, శ్రీకాంత్, చరణ్ జీడీ-వరి రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభవం తెలిపిన వారిలో జనసేన పార్టీ పలాస నియిజకవర్గం బాధ్యులు డాక్టర్ దుర్గరావు, టెక్కలి జనసేన నాయకులు కూరాకులు యాదవ్, అవినాష్, సోమేశ్, సిపిఐ రాష్ట్ర నాయకులు చపర వెంకటరమణ ఇతర కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.