భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఎరిగల నవీన్ కుమార్ కు జనసేన సత్కారం

ఇటీవల సెర్బియాలో జరిగిన పీపుల్ విత్ డిసేబిలిటి విభాగంలో ఇంటర్నేషనల్ చెస్ ఒలింపియాడ్ లో నాలుగో స్థానం సాధించి కాంస్య పతకం సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఎరిగల నవీన్ కుమార్ (ఆప్ సబ్ కి అవాజ్ కో – వైస్ చైర్) కి జనసేన పార్టీ భీమిలి ఇంచార్జి పంచకర్ల సందీప్ భీమిలి జనసేన పార్టీ ఆఫీసునందు ఆత్మీయ సత్కారం చేసారు. ఈ కార్యక్రమంలో ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ఫౌండర్ సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ దివ్యాంగులు పట్ల చాలా శ్రద్ధగా దివ్యాంగులకు వారి యొక్క ప్రతిభ బట్టి ఉపాధి అవకాశాలు కలగజేసామని తెలియజేశారు. సంస్థ వైస్ ఛైర్ కర్రి దినేష్ విహార్ మాట్లాడుతూ తమ సంస్థ అనేక రకాలైన రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు దివ్యాంగులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అలానే భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అధ్యక్షులు సందీప్ పంచకర్ల దివ్యాంగుల పట్ల మొదటి నుంచి ఆయన అనేక రకాల సహాయ సహకారాలు అందించినట్లు తెలియజేశారు. సంస్థ జాయింట్ సెక్రెటరీ కొండేటి భాస్కర్, సంస్థ చైర్ ఏసు మరియు జనసేన పార్టీ ప్రతినిధులు పూర్ణచంద్రరావు, కృష్ణయ్య, మధుపాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచకర్ల సందీప్ మాట్లాడుతూ నవీన్ కుమార్ (ఆప్ సబ్ కి అవాజ్ – కోవైస్ చైర్) అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ లో కాంస్య పతకం సాధించడం మన దేశానికే గర్వకారణం, అందునా మన ఆంధ్రప్రదేశ్, మన విశాఖపట్నం వ్యక్తి కావడం మరింత గర్వించదగ్గ విషయం అన్నారు. ఆయన దివ్యాంగులు అయినప్పటికీ వాళ్ళు మానసికంగా కృంగిపోకుండా ఎన్నో విజయాలు సాధిస్తూ వస్తున్నారు వీరిని మేము వికలాంగులుగా మేము ఎప్పుడూ భావించలేదు మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అలానే మా జనసేన పార్టీ ఎప్పుడు వారి పట్ల దైవాంస స్వరూపులుగా వారిని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వీరు ఈరోజున ఎంతో కష్టపడి మా వద్దకు అనేక క్రీడల్లో పథకాలు సాధించి రావడం ఆ నలుగురు క్రీడాకారులును మేము వారిని సత్కరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ మరియు సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ సేవలను కొనియాడారు. అంతేకాదు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు, ప్రతి ప్రభుత్వ ఆఫీసులోను, ప్రభుత్వ సంస్థల్లోను, విద్యా సంస్థలలోను దివ్యాంగులు ప్రవేశించేందుకు వీలుగా ర్యాంప్ లు నిర్మించేందుకు కృషి చేస్తామని, దివ్యాంగుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తామని, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియచేసారు.