మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సయ్యద్ నాగుర్ వలి

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలంలో శనివారం కురిసిన అకాల వర్షానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయని సత్తెనపల్లి జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో భాగంగా మాట్లాడుతూ.. నకరికల్లు మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం కురిసిన అకాల వర్షానికి మామిడి చెట్లు మొత్తం పూర్తిగా పడిపోయాయని, కాయలు మొత్తం పూర్తిగా రాలిపోయాయని అలానే ఎకరానికి లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయలకు రైతులకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి, జొన్న రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో అకాల వర్షానికి ఏమైనా గృహాలు దెబ్బతినుంటే వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా రైతులు మరియు ప్రజల సమస్యలపై పోరాడుతుందని అన్నారు.