వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: పితాని

ముమ్మిడివరం: గోదావరి నది వరద ముంపుకు గురైన లంక గ్రామాల ప్రజల సమస్యలను జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయక చర్యలు అందకపోవడం బాధాకరమని, ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా కృషి చేయాలని.. అదేవిధంగా లంక గ్రామాల ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి.. పశువులకు పశుగ్రాసం అందించి.. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారితో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పండరీష్, గోలకోటి వెంకన్నబాబు, సానబోయిన వీరభద్ర రావు, పోలిశెట్టి కృష్ణ, మాదాల శ్రీధర్, గణేశుల శ్రీను, గోలకోటి సాయిబాబు, మల్లిపూడి రాజా, పాయసం సాయి, కొప్పిశెట్టి బాబీ, బండారు సతీష్ తదితరులు పాల్గొన్నారు.