బైరి సోనీ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, న్యాయం చేయాలి: జనసేన డిమాండ్

నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ ఉద్యోగ భద్రత కోసం ఉద్యమిస్తూ అసువులు బాసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోనీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి, న్యాయం చేయాలని జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు
డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి సరికాదు. పల్లెల్ని ఆదర్శంగా తీర్చి దిద్దడంలో జే.పి.ఎస్ ల కృషి ఎంతో ఉంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం, ఒత్తిడే సోనీ ఆత్మహత్యని ప్రేరేపించింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని, సానుకూలంగా స్పందించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో చర్చలు జరిపి వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించి, వారి కుటుంబాలకు అండగా ఉండాలి. సోనీ అంత్యక్రియల్లో ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన జనసేన నియోజవర్గ కోఆర్డినేటర్ మేరుగు శివ కోటి యాదవ్ మరియు జనసైనికులు బొబ్బ పృథ్వి, షేక్ హుస్సేన్, గద్దల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.